Mahesh Gift for his dad 'Krishna'

by 5:03 AM 0 comments

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే ( మే 31 ) పురస్కరించుకుని అభిమానులు పలు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తూంటారు. అయితే ప్రిన్స్ మహేష్ సైతం తన తండ్రి మీద అభిమానంతో గత నాలుగేళ్లుగా తను నటిస్తున్న చిత్రం ఆడియో విడుదలో లేదా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తుండేవాడు. అలాగే ఈ ఏడాది కూడా కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రత్యేక బహుమతితో సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అదేంటంటే.. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ ‘శ్రీమంతుడు’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కృష్ణ పుట్టిన రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గనుక విడుదల కాకపోతే...తన తదుపరి చిత్రం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో మహేష్ ఉన్నాడని సమాచారం. పీవీపీ బ్యానర్ లో రూపొందనున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా...మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిచనున్నాడని తెలుస్తోంది.

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

0 comments:

Post a Comment