మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటిలోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లనైతే అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేక పోయిందో, అవే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్లు రంగుమారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌డ్రింకులో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లు మాత్రం ఒక కూల్‌డ్రింక్ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి.
అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి.
అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి.
0 comments:
Post a Comment