భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం బాహుబలి... చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. మే-15న ఈ సినిమా విడుదల కాబోతోందని స్వయంగా రాజమౌళి ప్రకటించడంతో.... బాహుబలిని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు సినీ ప్రేక్షకులు. ఇదిలా ఉంటే... భారీ అంచనాలు నెలకొనడంతో... ఈ సినిమా బిజినెస్ పరంగానూ సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా బాహుబలి శాటిలైట్ రైట్స్.. భారీ మొత్తం పలకడమే ఇందుకు నిదర్శనం. బాహుబలి రెండు భాగాల శాటిలైట్ రైట్స్ కు... దాదాపు 18కోట్లకు మాటీవీ నుంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. కాస్త అటు ఇటుగా ఈ డీల్ ఓకే అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు వంటి టాప్ స్టార్స్ సినిమాలు మాత్రమే తొమ్మిది కోట్ల శాటిలైట్ రైట్స్ పలుకుతున్నాయి. బాహుబలి సిరీస్ కు 18 కోట్లు అంటే.. ఒక్కో సినిమాకు 9 కోట్లు చెల్లిస్తున్నట్టే. ఈ లెక్కన ప్రభాస్ క్రేజ్... ఆ ఇద్దరు స్టార్ హీరోల రేంజ్ కు చేరుకున్నట్టేననే అంచనాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకు ఇంతటి క్రేజ్ రావడం వెనుక రాజమౌళి హస్తం ఎంతయినా ఉంది. అయితే ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పే సినిమాగా మాత్రం బాహుబలికి ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు, తమిళ్ తో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానున్న ఈ సినిమాతో... ప్రభాస్ మార్కెట్ కూడా పెరిగే అవకాశాలున్నాయి. సో... ఎలా చూసినా కెరీర్ లో... ప్రభాస్ రేంజ్ ను పెంచే సినిమా కానుంది బాహుబలి. మరి ఈ ఛాన్స్ ను యుటిలైజ్ చేసుకుని.. ప్రభాస్ ఏ రేంజ్ టాప్ స్టార్ గా ఎదుగుతాడో చూడాలి.
Unknown
DeveloperCras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.
0 comments:
Post a Comment