Good Words....Manchi Matalu

by 9:39 AM 0 comments
చనిపోయినప్పుడు నలుగురే మోస్తారు! తప్పు చేస్తూ బతికి వున్నప్పుడు ఊరంతా మోసేస్తారు!తస్మాత్ జాగ్రత్త!

నువ్వు వెలిగించే దీపం నీతోపాటు ఇతరులకు మార్గం చూపిస్తుంది! చీకట్లో దీపం వెలిగించకుండా వెలుగులోనూ చీకటినే చూసేవాడు మూర్ఖుడు

శబ్దం వినబడుతుంది! నిశ్శబ్దం వినపడదు,కనపడదు.కానీ నిశ్శబ్దం సాధించిన విజయం, శబ్దం సాధించ లేదు అని భారత స్వరాజ్య చరిత్ర చెబుతోంది

అసహ్యం, అసూయ, ఆగ్రహంతో నింపటానికి మనసు చెత్తబుట్ట కాదు! ప్రేమ, సంతోషం, సంతృప్తితో నిండిన ధనాగారం

సిగరెట్ తాగితే ప్రాణం తీస్తుంది, దాన్ని అమ్మేవాడు కోటీశ్వరుడు! మద్యం తాగితే ప్రాణం తీస్తుంది, దాన్ని అమ్మేవాడూ కోటీశ్వరుడు!అన్నం ప్రాణం ఇస్తుంది, కానీ వరి పండించే రైతు పేదవాడు

అద్దంలో ఎవరిముఖం వాళ్ళకు నచ్చుతుంది!ఎవరు రాసిన కధ వాళ్ళకు మెచ్చదగ్గదిగా వుంటుంది! కానీ నచ్చాల్సింది,మెచ్చాల్సింది ఎదుటి వాళ్లు

నా గురించి ఎదుటివాళ్ళు ఏం అనుకుంటున్నారో అన్నభయం, నేను చేసేది కరక్టేనా అన్న అనుమానం ప్రగతిని ఆపేస్తాయి! విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యండి

తిడుతుంటే మూగలా ఊరుకోవాలి. పొగుడుతుంటే చెవిటిలా ఉండాలి. విమర్శిస్తుంటే శ్రద్దగా వినాలి సహనాన్ని మించిన ఆయుధం లేదు

ఎదుటివారు చెప్పేది అర్ధం చేసు కోవడానికి వినాలి, అపార్ధం చేసుకోవడానికి కాదు! సమాధానం చెప్పడానికే కాదు సరిదిద్దు కోవడానికి కూడా 

డబ్బును చూసి గర్వపడే మగాడు, అందాన్ని చూసి అహంకారానికి పాలు పడే స్త్రీ , త్వరలో ప్రమాదంలో పడబోతున్నారని గుర్తు

తప్పు సరిదిద్దగల సమర్ధుడు ఆ పని చెయ్యకపొతే చేటు అతనికే అని మహాభారతం! అందుకే లీడర్ నిష్పక్ష పాతంగా,నిర్మొహమాటంగా, చెడుని అంతం చెయ్యాలి!

ఎదుటివాణ్ణి వంచించి జీవితం నాశనం చెయ్యటం హత్యా సదృశం, తనను తానే మోసం చేసుకోవటం ఆత్మహత్యా సదృశం! వాటికి దూరంగా వుండండి.

అప్పు ఇస్తే వడ్డీని పుట్టిస్తుంది అనుకుంటాం. నిజానికి పుట్టేది శత్రువు! ఋణం ఇచ్చే కంటే వీలైనంత దానం చెయ్యటం మేలు

బ్యాంకులో దాచుకుంటే డబ్బు పెరుగుతుంది.గుండెలో దాచుకుంటే బాధ పెరుగుతుంది! బాధ జబ్బుగా మారితే డబ్బు ఖర్చు అవుతుంది! కనుక బాధను పంచుకోండి హాయిగా వుంటారు! 

Unknown

Developer

Cras justo odio, dapibus ac facilisis in, egestas eget quam. Curabitur blandit tempus porttitor. Vivamus sagittis lacus vel augue laoreet rutrum faucibus dolor auctor.

0 comments:

Post a Comment