చాలా కాలంగా యాపిల్ ప్రేమికులు ఎదురుచూస్తున్న వాచీ రానేవచ్చింది. ఈ యాపిల్ వాచీ కోసం వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్స్ బుక్ చేసుకుంటారు. 24వ తేదీ నుంచి వీటిని కస్టమర్లకు అందిస్తారు. ఐఫోన్‌లోను, ఐపాడ్‌లోను ఉన్న ప్రధానమైన ఫీచర్స్‌తో రూపొందించిన ఈ వాచీ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషిస్తుందనటంలో సందేహం లేదు..
సాధారణంగా యాపిల్ ఎప్పుడు ఒకే మోడల్‌ను విడుదల చేస్తూ ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం- యాపిల్ వాచ్ స్పోర్ట్, యాపిల్ వాచ్, యాపిల్ వాచ్ ఎడిషన్ అనే మూడు మోడల్స్‌ను విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్ దీర్ఘచతురాస్రాకారంలో ఉంటాయి. ఈ వాచీలలోని కొన్ని ప్రధానాంశాలు..
యాపిల్ వాచ్ స్పోర్ట్
ఇది స్పేస్ గ్రే, సిల్వర్ రంగుల్లో ఉంటుంది. దీని ఫినిషింగ్ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ మాదిరిగా ఉంటుంది. దీనిలో ఐయాన్ ట్రీటబుల్ గ్లాస్ ఉంటుంది. ఈ వాచీల సా్ట్రప్ రకరకాల రంగుల్లో లభ్యమవుతుంది. వినియోగదారులు తమకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర దాదాపు 20 వేల రూపాయల దాకా ఉంటుంది.
యాపిల్ వాచ్/ యాపిల్ వాచ్ ఎడిషన్
యాపిల్ వాచ్‌ను సాధారణ లోహాలతో తయారుచేస్తే, యాపిల్ వాచ్ ఎడిషన్‌ను 18 క్యారెట్ గోల్డ్‌ను ఉపయోగించి తయారుచేశారు. కొన్ని ఫీచర్స్ తప్పితే మిగిలినవన్నీ రెండింటలో సరిసమానంగానే ఉంటాయి. యాపిల్ వాచ్ ధర దాదాపు 40 వేల రూపాయల దాకా ఉంటే యాపిల్ వాచ్ ఎడిషన్ ధర 60 వేల రూపాయల వరకూ ఉంటుంది.
యాపిల్ వాచ్ ఎడిషన్‌లో రకరకాల సా్ట్రప్‌లను పెట్టుకొనే సౌకర్యంతో పాటుగా, వాచీ స్ర్కీన్‌ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోగలిగిన అవకాశం కూడా ఉంటుంది. మ్యాప్‌లు, అలారం, వాతావరణ సమాచారం, స్టాక్ ట్రాకర్ వంటి అప్లికేషన్లు కూడా ఈ వాచీలో ఉంటాయి. ఈ వాచీ కింది భాగంలో ఉండే చిన్న బటన్‌ను నొక్కితే కాంటాక్ట్‌లన్నీ వస్తాయి. చేతి కదలికలతో కాల్స్‌ను రిసీవ్ చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది. హార్ట్‌బీట్ మానిటర్, యాక్టివిటీ ట్రాకర్‌ల ద్వారా మీరు ఎంత సేపు వ్యాయామం చేశామనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
0 comments:
Post a Comment